
AP TET 2025లో 90 మార్కుల వస్తే AP DSCలో వెయిటేజ్ ఎంత? (What is the Weightage for AP DSC if get 90 marks in AP TET 2025?) :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) అత్యంత ముఖ్యమైన అర్హత పరీక్షలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, AP TET 2025 సైకిల్ కోసం అధికారిక మార్గదర్శకాలు, పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఈ మేరకు AP TET 2025 ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు AP TETలో క్వాలిఫై అయ్యేందుకు ప్రిపరేషన్‌ని ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే AP TET 2025లో ఎన్నిమార్కులు సాధిస్తే AP DSC ఎంత వెయిటేజీ ఉంటుందనే విషయంపై అభ్యర్థులు ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో AP TET 2025లో 90 మార్కులు సాధించినట్లయితే AP DSC వెయిటేజ్ (weightage for AP DSC if get 90 marks in AP TET 2025)
ఎంత ఉంటుందో పూర్తి విశ్లేషణను ఇక్కడ చూడవచ్చు.
ఒక అభ్యర్థి AP TETలో 90 స్కోర్ చేస్తే అది AP DSC మెరిట్ జాబితాలో 12 (20 శాతానికి)కి సమానం. ఉదాహరణకు ఒక అభ్యర్థి AP DSCలో 30 స్కోర్ చేస్తే, AP DSC మెరిట్ లిస్ట్‌లో వారి మొత్తం మార్కులు 36 అవుతాయి. విద్యార్థు తమ ఎంపిక అవకాశాలను అంచనా వేయడానికి ఈ దిగువున టేబుల్లో AP DSCలోని అన్ని ఇతర స్కోర్‌ల వివరాలను అందించాం. అభ్యర్థులు వీటిని పరిశీలించవచ్చు.
AP TET 90 మార్కులు వస్తే AP DSC వెయిటేజ్ ఎంత? 2025 (AP TET 90 Marks vs AP DSC Weightage Analysis 2025)
AP TETకి 20 శాతం వెయిటేజీని, AP DSC కి 80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటే APTET 2025లో 90 మార్కులకు వెయిటేజీ విశ్లేషణ ఈ దిగువున ఇచ్చిన పట్టికలోని విధంగా ఉంటుంది.
AP TET 2025లో సాధించిన మార్కు | AP TET స్కోర్ వెయిటేజ్ ఇన్ మెరిట్ లిస్ట్ | AP DSC 2025లో సాధించిన మార్కు | మెరిట్ జాబితాలో AP DSC స్కోర్ వెయిటేజ్ | మెరిట్ జాబితాలో మొత్తం మార్కు |
|---|---|---|---|---|
90 | 12 | 30 | 24 | 36 |
90 | 12 | 35 | 28 | 40 |
90 | 12 | 40 | 32 | 44 |
90 | 12 | 45 | 36 | 48 |
90 | 12 | 50 | 40 | 52 |
90 | 12 | 55 | 44 | 56 |
90 | 12 | 60 | 48 | 60 |
90 | 12 | 65 | 52 | 64 |
90 | 12 | 70 | 56 | 68 |
90 | 12 | 75 | 60 | 72 |
90 | 12 | 80 | 64 | 76 |

AP TET 2025 ప్రిపరేషన్ టిప్స్ (AP TET 2025 Preparation Tips)
AP TET 2025 పరీక్షలో క్వాలిఫై సాధించాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్టడీ ప్లాన్‌ని రూపొందించుకుని పరీక్షకు ప్రిపేర్ కావాలి. 2025లో AP TET ప్రిపరేషన్ టిప్స్ కొన్ని దిగువున అందించాం. సిలబస్, పరీక్షా విధానాన్ని ఇక్కడ అందించాం. అభ్యర్థులు ఈ టిప్స్‌ని ఫాలో అయి AP TETలో క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించవచ్చు.
ముందుగా అభ్యర్థులు అన్ని సబ్జెక్టులను కవర్ చేసే స్టడీ టేబుల్‌ను రూపొందించి, స్థిరంగా అధ్యయనం చేయాలి.
పరీక్ష కోసం ప్రామాణిక అధ్యయన సామగ్రిని సేకరించి పెట్టుకోవాలి.
పిల్లల అభివృద్ధి, బోధనపై దృష్టి పెట్టాలి.
పదజాలం, వ్యాకరణం, గ్రహణశక్తిని అభివృద్ధి చేయడం ద్వారా భాషా నైపుణ్యాలను బలోపేతం చేయాలి.
AP TET శాంపిల్ పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. AP TET 2025 మాక్ టెస్ట్‌ల ద్వారా ప్రాక్టీస్ చేయవచ్చు.
సమయ నిర్వహణను అభివృద్ధి చేసుకోవాలి.
కరెంట్ అపైర్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
AP TET vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2025 (AP TET vs AP DSC Weightage Analysis 2025)
ఇతర మార్కుల స్థాయిల కోసం, AP TET 2024 vs AP DSC వెయిటేజ్ విశ్లేషణను ఈ క్రింది లింక్‌లలో యాక్సెస్ చేయవచ్చు.
మార్కులు | లింక్ |
|---|---|
60 మార్కులు | |
80 మార్కులు | |
95 మార్కులు | |
100 మార్కులు | |
110 మార్కులు | |
120 మార్కులు | AP TET 120 మార్కులు vs AP DSC 2025 వెయిటేజ్ ఎలా లెక్కించబడుతుంది? |
130 మార్కులు |
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



















సిమిలర్ ఆర్టికల్స్
SWAYAM పరీక్ష 2026కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
AP NMMS ఆన్సర్ కీ 2025-26 విడుదల తేదీ, PDF డౌన్లోడ్ లింక్స్
TG SET ST కేటగిరీ కటాఫ్ మార్కులు 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌ను తనిఖీ చేయండి
TG SET SC కేటగిరీ కటాఫ్ మార్కులు 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌ను తనిఖీ చేయండి
TG SET EWS కేటగిరీ కటాఫ్ 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌ను తనిఖీ చేయండి
TG SET జనరల్ కేటగిరీ కటాఫ్ 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌లను తనిఖీ చేయండి