AP ICET Hall Ticket 2023 Released: ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు 2023 రిలీజ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: May 20, 2023 11:51 AM

AP ICET హాల్ టికెట్లు 2023 అధికారిక వెబ్‌సైట్‌లో   (AP ICET Hall Ticket 2023 Released) విడుదలయ్యాయి. అభ్యర్థుల కోసం డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ అందజేయడం జరిగింది. హాల్ టికెట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
AP ICET Hall Ticket 2023 Released: ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు 2023 రిలీజ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP ICET Hall Ticket 2023 Released: ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు 2023 రిలీజ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP ICET హాల్ టికెట్ 2023 విడుదల (AP ICET Hall Ticket 2023 Released): APSCHE తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం AP ICET హాల్ టికెట్ 2023ని ఈరోజు (మే 20, 2023న) విడుదలైంది. పరీక్ష కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ (AP ICET Hall Ticket 2023 Released) చేసుకోగలరు. హాల్ టికెట్లు లేకపోతే అభ్యర్థులు పరీక్షా హాల్లోకి అనుమతించడం జరగదు.
AP ICET 2023 పరీక్ష మే 24, 25, 2023న జరుగుతాయి. AP ICET హాల్ టికెట్లపై పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం, అభ్యర్థి పేరు, రోల్ నెంబర్, ఫోటో వంటి ప్రాథమిక వివరాలు ఉంటాయి. AP ICET 2023 హాల్ టికెట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

AP ICET హాల్ టికెట్ 2023 - డౌన్‌లోడ్ లింక్

ఏపీ ఐసెట్ హాల్ టికెట్ 2023 డేట్ అండ్ టైమ్ (AP ICET Hall Ticket 2023 Date and Time)

పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి చెల్లుబాటు అయ్యే హాల్ టిక్కెట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దరఖాస్తుదారులు AP ICET హాల్ టికెట్ 2023 తేదీ, వివరాలు ఈ దిగువు పట్టికలో ఇవ్వడం జరిగింది.
ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
ఏపీ ఐసెట్ హాల్ టికెట్ 2023 ఫలితాల తేదీ మే 20, 2023
ఏపీ ఐసెట్ హాల్ టికెట్ 2023 రిలీజ్ సమయం సాయంత్రం 4 గంటలకు
AP ICET 2023 పరీక్షా తేదీ మే 24, 25, 2023
అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in

ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు 2023 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AP ICET Hall Ticket 2023?)

AP ICET 2023 హాల్ టికెట్లను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 1: AP ICET అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inని సందర్శించాలి
స్టెప్ 2: హోమ్‌పేజీలో, ”AP ICET హాల్ టికెట్ 2023 లింక్”పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
స్టెప్ 4: ఈ వివరాలను సరిగ్గా నమోదు చేసిన తర్వాత అభ్యర్థులు “డౌన్‌లోడ్ హాల్ టికెట్” బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం AP ICET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయండి.
ఏపీ ఐసెట్ 2023 హాల్ టికెట్‌లో వివరాలు ఏదైనా తప్పుగా ఉంటే అభ్యర్థులు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

/news/ap-icet-hall-ticket-2023-released-40750/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top