ఏపీ ఐటీఐ 2023 దరఖాస్తు ఫార్మ్ (AP ITI Admission Phase 2 Application Form Release) విడుదలైంది. అభ్యర్థులు తప్పనిసరిగా జూలై 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు AP ITI దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాల్సి సబ్మిట్ చేసుకోవాలి.
AP ITI Admission Phase 2 Application Form Release: ఏపీ ఐటీఐ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, ఈ లింక్‌తో దరఖాస్తు చేసుకోండి
ఏపీ ఐటీఐ అడ్మిషన్ ఫేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ (AP ITI Admission Phase 2 Application Form Release):
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ 2023 దరఖాస్తు ప్రక్రియ రెండో దశ ప్రారంభమైంది. జూలై 31, 2023న ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఏపీ ఐటీఐ అడ్మిషన్ 2023 దరఖాస్తు ఫార్మ్ (AP ITI Admission Phase 2 Application Form Release) విడుదలైంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా జూలై 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు AP ITI దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాల్సి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ ముఖ్యాంశాలు (Andhra Pradesh ITI Admission Highlights)
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ ముఖ్యాంశాలు గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది.
AP ITI 2023 కండక్టింగ్ బాడీ
ఉపాధి, శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రవేశ విధానం
మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ
ఆన్‌లైన్ విధానం
కౌన్సెలింగ్ ప్రక్రియ
ఆన్‌లైన్ విధానం
కనీస విద్యార్హత
పదో తరగతి
అధికారిక వెబ్‌సైట్
https://iti.ap.gov.in/
ఏపీ ఐటీఐ అడ్మిషన్ తేదీలు 2023 (AP ITI Admission Dates 2023)
ఈవెంట్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ఫార్మ్ విడుదల తేదీ
జూలై 13, 2023
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ
జూలై 31, 2023
మెరిట్ లిస్ట్ విడుదల తేదీ
తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ 2023 దరఖాస్తు చేసుకునే ప్రక్రియ (Andhra Pradesh ITI 2023 Application Process)
పదో తరగతి పూర్తి చేసిన వ్యక్తులు ఐటీఐలో జాయిన్ అవ్వొచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.
ముందుగా అభ్యర్థులు
https://iti.ap.gov.in
అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లేది.
"కొత్త రిజిస్ట్రేషన్" లింక్‌పై క్లిక్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకోవడానికి వ్యక్తిగత వివరాలను అందించాలి.
మళ్లీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి AP ITI అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
ప్రాధాన్యత తగ్గే క్రమంలో పేజీలో అందుబాటులో ఉన్న ITIల జాబితా నుంచి మీకు ఇష్టమైన ITIలను ఎంచుకోండి.
పేర్కొన్న స్పెసిఫికేషన్‌ల ప్రకారం మీ స్కాన్ చేసిన అన్ని పత్రాలు, చిత్రం, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
"SUBMIT" బటన్‌పై క్లిక్ చేసి భవిష్యత్తు సూచన కోసం సమర్పించిన దరఖాస్తు ఫార్మ్‌ను ప్రింట్ తీసుకోండి.