APలో పారా మెడికల్ విద్యార్థులకు శుభవార్త, తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ

manohar

Published On:

APలో పారా మెడికల్ డిప్లొమా కోర్సు విద్యార్థులకు మొదటిసారిగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2 నుండి 4 వరకు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆలస్యం లేకుండా కోర్సు పూర్తి చేయగలరు.

AP paramedical students Supplementary examsAP paramedical students Supplementary exams

AP పారా మెడికల్ పరీక్ష విధానంలో మార్పు (Change in AP Para Medical Exam Pattern): ఆంధ్రప్రదేశ్‌లో పారా మెడికల్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న పరీక్షా విధానంలో ఉన్న లోపాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తించి, ప్రభుత్వము సప్లిమెంటరీ పరీక్షలు తొలిసారి నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఇది పారా మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసే విధంగా మారనుంది.డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ వంటి రెండేళ్ల కోర్సుల్లో ఏదైనా సబ్జెక్టులో ఫెయిల్ అయితే, ఇంతకు ముందు వార్షిక పరీక్షలు వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉండేది. అందువలన కోర్సు పూర్తైయినప్పటికీ సర్టిఫికెట్లు ఆలస్యం అవ్వటం, ఉద్యోగాలకు దరఖాస్తు చేయక‌పోవటం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ పరిస్థితి విద్యార్థుల కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపోతుంది.

పారా మెడికల్ రంగంలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర ఆరోగ్య సంస్థలలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నప్పటికీ, సర్టిఫికెట్లు సమయానికి అందకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆ అవకాశాలను కోల్పోతున్నారు. ఒకే ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం వల్ల మొత్తం సంవత్సరం వృథా కావడం కూడా వారి భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఇది అన్యాయంగా అనిపించడంతో విద్యార్థులు మరియు విద్యా నిపుణులు చాలా కాలంగా ఈ విధానంలో మార్పులు కోరుతూ వస్తున్నారు.ఈ విషయాన్ని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల ప్రకారం, పారా మెడికల్ విద్యార్థుల నష్టాన్ని తగ్గించేందుకు 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా సప్లిమెంటరీ పరీక్షల సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసి, అమలుచేసే చర్యలను కూడా ప్రారంభించారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా పారా మెడికల్ విద్యార్థులకు స్పష్టమైన అవకాశాలు అందించబడ్డాయి. పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు గరిష్టంగా ఐదు సబ్జెక్టుల వరకు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణయించిన గడువులో దరఖాస్తు పూర్తి చేయాలి, మరియు సప్లిమెంటరీ పరీక్షలు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించబడతాయి. ఈ విధానం ద్వారా విద్యార్థులు ఏడాది కాలం వృథా కాకుండా త్వరగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు పొందే అవకాశం పొందుతారు

ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులు ఏడాది పాటు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, త్వరగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు పొందగలుగుతారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి, మరియు పారా మెడికల్ రంగంలో శిక్షణ పొందిన యువత భవిష్యత్తు మరింత భద్రమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-paramedical-supplementary-exams-2025-26-75971/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top