AP POLYCET Results 2023: రేపే ఏపీ పాలిసెట్ ఫలితాలు, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

Rudra Veni

Published On:

ఏపీ పాలిసెట్ ఫలితాలు 2023 రేపు (మే 20న) విడుదలకానున్నాయి.  ఏపీ పాలిసెట్ 2023 పరీక్ష మే 10వ తేదీన జరిగింది. ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ  అందజేయడం జరిగింది. 
AP POLYCET Results 2023: రేపే ఏపీ పాలిసెట్ ఫలితాలు, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదేAP POLYCET Results 2023: రేపే ఏపీ పాలిసెట్ ఫలితాలు, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

ఏపీ పాలిసెట్ ఫలితాలు 2023 (AP POLYCET Results 2023): ఏపీ పాలిసెట్ 2023 పరీక్షా ఫలితాలు (AP POLYCET Results 2023) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు (మే 20 ) శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. కాగా ఏపీ పాలిసెట్ 2023 పరీక్ష మే 10వ తేదీన జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఏపీ పాలిసెట్ 2023ని నిర్వహించడం జరుగుతుంది. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు సీట్లు లభిస్తాయి. ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను (AP POLYCET Results 2023) https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌‌లో చూడొచ్చు.

ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు-డైరక్ట్ లింక్

AP POLYCET 2023 ఫలితాన్ని ఎలా చెక్ చేయాలి? (How to Check AP POLYCET 2023 Result)

ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకునే విధానం ఈ కింది విధంగా ఉంటుంది.
  • ఫలితాలు చెక్ చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు polycetap.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
  • హోంపేజీలో AP POLYCET Result Link అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
  • అనంతరం స్క్రీన్‌పై అభ్యర్థి ఫలితాలను కనిపిస్తాయి.
  • తర్వాత తమ ఏపీ పాలిసెట్ ఫలితాలను ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

ఏపీ పాలిసెట్ ఫలితాల 2023 కార్డుపై ఉండే వివరాలు (Details mentioned on the AP POLYCET Result 2023)

ఏపీ పాలిసెట్ 2023 ఫలితాల కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. అభ్యర్థులు ఆ వివరాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి.
  • అభ్యర్థి పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేది
  • జెండర్
  • కేటగిరి
  • పరీక్షలో పొందిన మొత్తం స్కోర్
  • పరీక్షలో వచ్చిన ర్యాంక్
  • అర్హత స్థితి
  • కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం సూచనలు

ఏపీ పాలిసెట్ 2023లో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, కెమికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి.
తెలుగులో ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-polycet-2023-results-to-be-released-tomorrow-here-results-link-40657/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top