CSC జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాలు, 282 పోస్టులు

manohar

Published On:

దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 282 ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి CSC e-Governance Services India Limited ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31,2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CSC Jobs 2026CSC Jobs 2026

జిల్లా కేంద్రాల్లో 282 ఆధార్ ఉద్యోగాలు (282 Aadhaar jobs in district centers): దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో పనిచేస్తున్న CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంలో మొత్తం 282 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు జిల్లా స్థాయి ఆధార్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అధార్ నమోదు, సవరణలు, ధృవీకరణ వంటి సేవల నిర్వహణ ఈ పోస్టుల ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి. ప్రభుత్వ సేవలతో సంబంధం ఉన్న ఈ ఉద్యోగాలు యువతకు మంచి అవకాశం అందిస్తున్నాయి.

అర్హత విషయానికి వస్తే, అభ్యర్థులు పోస్టుకి అనుగుణంగా ఇంటర్ (10+2), ఐటీఐ లేదా సంబంధిత అర్హత ఉన్న పట్టా కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారిని ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేయాలి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31,2026 వరకూ దరఖాస్తు పూర్తి చేయాలి.

CSC ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ లింక్ (CSC Aadhaar Supervisor/Operator Jobs Notification Link)

జిల్లా కేంద్రాల్లో 282 ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల కోసం CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు, అర్హతలు తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ లింక్‌ను పరిశీలించాలి.

CSC ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం (Online application procedure for CSC Aadhaar Supervisor/Operator jobs)

CSC ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాలకు అర్హతగల అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఈ క్రింది దశలను పాటించాలి.

  • ముందుగా అభ్యర్థులు CSCఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • ఆ తరువాత “Aadhaar Supervisor/Operator Recruitment” నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి
  • ఓపెన్ చేసిన తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి
  • అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
  • అర్హతలకు సంబంధించిన పత్రాలు అప్లోడ్ చేయాలి
  • నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించాలి
  • దరఖాస్తును సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి

జిల్లా కేంద్రాల్లో ఆధార్ సేవల రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు CSC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. అర్హత కలిగిన వారు చివరి తేదీ జనవరి 31,2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/csc-aadhaar-supervisor-operator-jobs-2026-75931/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top