SBIలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు, దరఖాస్తులకు ఇదే చివరి అవకాశం

manohar

Published On:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1,146 స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 02 నుంచి జనవరి 10, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

SBI SCO Posts 2026SBI SCO Posts 2026

SBIలో భారీ ఉద్యోగావకాశాలు (Huge job opportunities in SBI): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ముంబయి ఆధ్వర్యంలో ఒప్పంద పరంగా స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ (SCO) నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,146 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఉంది. వాటిలో VP వెల్త్ (SRM)కు 582 పోస్టులు, AVP వెల్త్ (RM)కు 237 పోస్టులు, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ కు 327 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా జనవరి 2, 2026 నుంచి జనవరి 10, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.750, SC / ST / PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అవసరమైతే అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. అర్హులైనవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.

SBI SCO రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ లింక్ (SBI SCO Recruitment 2026 Notification Link)

SBI స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ (SCO) జాబ్ నోటిఫికేషన్‌ను ఈ క్రింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

SBI SCO నియామకాలు 2026 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (SBI SCO Recruitment 2026 Online Application Procedure)

SBI SCO పోస్టులకు దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తు చేసే ముందు ఈ క్రింది దశలను పాటించండి.

  • ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయండి
  • ఆ తరువాత హోమ్ పేజీలో Careers విభాగాన్ని క్లిక్ చేయండి
  • Latest Announcements / Recruitment of Specialist Cadre Officers లింక్ ఎంపికించండి
  • కొత్త అభ్యర్థులు ముందుగా Registration పూర్తి చేయండి
  • రిజిస్ట్రేషన్ ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపాలి
  • అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
  • వర్తించే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి
  • అన్ని వివరాలు తనిఖీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
  • అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి

SBI SCO ఉద్యోగాలు 2026 అర్హతలు & వయోపరిమితి వివరాలు (SBI SCO Jobs 2026 Qualifications & Age Limit Details)

SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నిర్దిష్ట అర్హతలు మరియు వయోపరిమితిని ఈ క్రింది విధముగా పూర్తి చేయాలి.

అర్హతలు (Eligibility Criteria):

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి
  • పోస్టుకు సంబందించిన విభాగంలో పని అనుభవం తప్పనిసరి
  • వెల్త్ మేనేజ్‌మెంట్ / బ్యాంకింగ్ / కస్టమర్ రిలేషన్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

వయోపరిమితి (Age Limit):

  • జనవరి 01, 2025 నాటికి వయస్సు 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి
  • OBC అభ్యర్థులకు, 3 సంవత్సరాల వయోసడలింపు
  • SC / ST అభ్యర్థులకు, 5 సంవత్సరాల వయోసడలింపు
  • PwBD అభ్యర్థులకు, 10 సంవత్సరాల వయోసడలింపు

SBI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ బ్యాంకింగ్ రంగంలో మంచి అవకాశం అందిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/sbi-sco-recruitment-2026-1146-posts-apply-online-76028/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top