తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు దరఖాస్తు వివరాలు, అర్హత, వేతనం & ఎంపిక ప్రక్రియ

manohar

Updated On: August 25, 2025 03:29 PM

తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 8 నుంచి 22,2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అనుమతించబడతాయి.అర్హత, ఫీజు, ఎంపిక వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు దరఖాస్తు వివరాలు, అర్హత, వేతనం & ఎంపిక ప్రక్రియతెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు దరఖాస్తు వివరాలు, అర్హత, వేతనం & ఎంపిక ప్రక్రియ

1623 డాక్టర్ పోస్టుల పూర్తి వివరాలు, దరఖాస్తు, అర్హత, ఫీజు, ఎంపిక & వేతనం (Complete details of 1623 Doctor posts, application, eligibility, fee, selection & salary): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా జిల్లా ఆసుపత్రులు, ఏరియా హాస్పిటల్స్, CHC లలో ప్రత్యేక వైద్య సేవలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, పాథాలజీ వంటి విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత స్పెషలిటీ లో MD/MS/DNB లేదా డిప్లొమా పూర్తి చేసినవారు మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 8 నుండి 22, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేతనం నెలకు రూ.56,500 నుండి రూ.1,37,050 వరకు ఉంటుంది. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు మరియు ఎంపిక ప్రక్రియ (Eligibility & Application Fee and Selection Process)

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఫీజు వివరాలు& ఎంపిక ప్రక్రియ తప్పనిసరిగా చూడాలి.

దరఖాస్తు ఫీజు:

  • సాధారణ అభ్యర్థులు, రూ.500
  • ప్రాసెసింగ్ ఫీజు, రూ.200
  • SC/ST/BC/EWS/PH/ఎక్స్సర్వీస్‌మెన్/నిరుద్యోగులకు ఫీజు మినహాయింపు
  • అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు అర్హతల ఆధారంగా జరుగుతుంది.
  • అకడమిక్ క్వాలిఫికేషన్ మార్కులు
  • అనుభవం ఉన్నవారికి అదనపు వెయిటేజ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలా దరఖాస్తు చేసుకోవాలి (How to apply for Telangana State Medical and Health Department)

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ క్రింద ఉన్న దశలను చూడండి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి tshc.gov.in వెళ్ళండి
  • ఆ తరువాత “1623 Specialist Doctor Posts” లింక్ పై క్లిక్ చేయండి
  • కొత్త యూజర్‌గా రిజిస్టర్ చేసుకోండి లేదా లాగిన్ అవ్వండి
  • పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించి సమర్పించండి
  • దరఖాస్తు సబ్మిట్ అయ్యిందని కన్ఫర్మేషన్ పొందండి

వేతనం & విభాగాల వారీ ఖాళీలు (Salary & Department wise vacancies)

విభాగాల వారీగా పోస్టుల సంఖ్య ను ఈ క్రింద ఉన్న టేబుల్ పట్టికలో చూడండి.

విభాగం (Department)

పోస్టులు (Vacancies)

అనస్థీషియా (Anesthesia)

226

గైనకాలజీ (Gynecology)

247

పీడియాట్రిక్స్ (Pediatrics)

219

జనరల్ మెడిసిన్ (General Medicine)

166

జనరల్ సర్జరీ (General Surgery)

174

ఆర్థోపెడిక్స్ (Orthopedics)

89

ఆప్టమాలజీ (Ophthalmology)

38

ఈఎన్‌టి (ENT)

54

రేడియాలజీ (Radiology)

71

పాథాలజీ (Pathology)

94

చర్మ వ్యాధులు (Dermatology)

31

సైకియాట్రీ (Psychiatry)

47

పల్మనరీ మెడిసిన్ (Pulmonary Medicine)

58

ఫోరెన్సిక్ మెడిసిన్ (Forensic Medicine)

62

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (Hospital Administration)

24

బయోకెమిస్ట్రీ (Biochemistry)

8

మైక్రోబయాలజీ (Microbiology)

8

తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ అభ్యర్థుల కోసం పెద్ద అవకాశంగా ఉంది. సబ్మిట్ తేదీలను గమనించి, అర్హత మరియు ఫీజు ప్రమాణాలను అర్ధం చేసుకుని మాత్రమే దరఖాస్తు చేయడం మంచిది. అన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, కాబట్టి అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసి, ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/telangana-1623-specialist-doctor-posts-2025-70339/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy