Telangana NEET UG Web Options Date 2023: తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్‌లు, ఛాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Published On:

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్ల తేదీ 2023  (Telangana NEET UG Web Options Date 2023)  త్వరలో ప్రకటించబడతాయని అభ్యర్థులు తెలుసుకోవచ్చు. వెబ్ ఆప్న్ల కోసం విండో ఆగస్ట్ 2023 మొదటి వారంలో ఓపెన్ అవుతుంది.
Telangana NEET UG Web Options Date 2023Telangana NEET UG Web Options Date 2023

తెలంగాణ నీట్, వెబ్ ఆప్షన్ల తేదీ 2023 (Telangana NEET UG Web Options Date 2023): KNRUHS తెలంగాణ 26 జూలై 2023న తమ వెబ్ ఆప్షన్‌లను (Telangana NEET UG Web Options Date 2023) వినియోగించుకోవడానికి అర్హులైన అభ్యర్థుల అధికారిక మెరిట్ లిస్ట్‌ని విడుదల చేసింది. అయితే వెబ్ ఆప్షన్ల కోసం విండో ఇంకా ఓపెన్ అవ్వలేదు. అభ్యర్థులు ఆగస్టు 2023 మొదటి వారంలో తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్లు విడులయ్యే ఛాన్స్ ఉంది. MCC ఆల్ ఇండియా కోటా NEET UG సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నందున జూలై 29, 2023న సీట్ల కేటాయింపు విడుదల చేయబడుతుంది. తర్వాత తెలంగాణ NEET UG 2023 కోసం వెబ్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సీటు అలాట్‌మెంట్ విడుదల చేయడానికి వెబ్ ఆప్షన్‌లపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి| KNRUHS తెలంగాణ నీట్ మరియు మెరిట్ లిస్ట్ 2023

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ తేదీ 2023 (Telangana NEET UG Web Options Date 2023)

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్ల 2023 కోసం అభ్యర్థులు అంచనా తేదీని ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించడం జరిగింది.
ఈవెంట్స్ అంచనా తేదీలు
తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే తేదీ ఆగస్టు 2023 మొదటి వారం
తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ 2023 ముగింపు విండో ఓపెన్ అయిన 2-3 రోజుల తర్వాత
సీట్ల కేటాయింపు విడుదల ఆగస్టు 2023 రెండో వారం

అభ్యర్థులు తెలంగాణ నీట్ UG వెబ్ ఆప్షన్స్ 2023ని జాగ్రత్తగా పూరించాలని, వారి ప్రాధాన్యత ప్రకారం వారికి సీట్లు కేటాయించబడ్డాయని నిర్ధారించుకోండి. అభ్యర్థుల వెబ్ ఆప్షన్‌ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది కాబట్టి కేటగిరీ వారీగా సీట్ మ్యాట్రిక్స్‌ని చెక్ చేసి, తదనుగుణంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించడం ఉత్తమం. అదనంగా అభ్యర్థులు ముందుగా అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజుతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు సీట్లను అంగీకరించడానికి, అడ్మిషన్‌ని నిర్ధారించడానికి సీటు కేటాయింపు తర్వాత పరిమిత రోజులు మాత్రమే ఇవ్వబడతాయి.
ఎంట్రన్స్ పరీక్షలు , అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.

/news/telangana-neet-ug-web-options-date-2023-know-when-choice-filling-begins-43527/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top