తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలు, సీటు సాధిస్తే ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య

Rudra Veni

Updated On: January 19, 2026 05:29 PM

తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. 
తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలు, సీటు సాధిస్తే ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యతెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలు, సీటు సాధిస్తే ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య

TG మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు 2026 షెడ్యూల్ (TG Model Schools Admissions 2026 Schedule) : తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాఠశాలలో అడ్మిషన్ సాధించే విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి విద్యను పొందవచ్చు. ఇందులో సీటు వచ్చే విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఏర్పడిన ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణలోని మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు (TG Model Schools Admissions 2026 Schedule) ఉంటాయి. విద్యార్థులు తమకు దగ్గర లేదా సమీప మండలంలోని పాఠశాలల్లో సీటు పొందడానికి ఓ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సీటు పొందవచ్చు.

తెలంగాణ మోడల్ స్కూళ్ల అడ్మిషన్లు 2026 షెడ్యూల్ (TG Model Schools Admissions 2026 Schedule)

తెలంగాణ మోడల్ స్కూళ్ల అడ్మిషన్లు 2026 షెడ్యూల్‌ని (TG Model Schools Admissions 2026 Schedule) ఈ దిగువున అందించాం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
  • జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

  • ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతోంది.

  • 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

  • 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

తెలంగాణ మోడల్ స్కూల్ దరఖాస్తు ఫీజు, దరఖాస్తు చేసుకునే విధానం...

తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాల (TG Model Schools Admissions 2026 Schedule) కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు ఓసీ అంటే జనరల్ అభ్యర్థులైతే రూ.200లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.125లు చెల్లించాల్సి ఉంటుంది.

youtube image

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tg-model-school-admissions-2026-27-registration-will-start-from-jan-28-76566/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top