TG TET 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు విడుదల,డైరెక్ట్ లింక్, లైవ్ అప్‌డేట్స్

Rudra Veni

Updated On: January 30, 2026 12:28 PM

TG TET 2026 ఆన్సర్ కీ త్వరలో రిలీజ్ కానుంది. కాలేజ్ దేఖో అంచనా ప్రకారం ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు ఈరోజు అంటే జనవరి 30 విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరిగింది.

 
TG TET 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు విడుదల,డైరెక్ట్ లింక్, లైవ్ అప్‌డేట్స్TG TET 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు విడుదల,డైరెక్ట్ లింక్, లైవ్ అప్‌డేట్స్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, పరీక్ష నిర్వహించిన త్వరలోనే TG TET ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తు సాగుతుంది. TG TET పరీక్ష జనవరి 3, 2026 నుంచి జరిగింది. దీనికి సంబంధించిన TG TET ఆన్సర్ కీని అధికారులుపేపర్ 1, 2 లకు విడివిడిగా PDF రూపంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు ఈరోజు అంటే జనవరి 30న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. విడుదలైన తర్వాత TG TET ఆన్సర్ కీ 2025 డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఈ పేజీలో అందించబడుతుంది. TG TET కీ రెండు దశల్లో విడుదల చేయబడుతుంది. అభ్యర్థుల నుంచి సవాళ్లను ఆహ్వానించడానికి పాఠశాల విద్యా శాఖ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన సవాళ్లను సమీక్షించిన తర్వాత TG TET ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తారు.
ఇది కూడా చూడండి : జనరల్, SC, ST, BC, EWS కేటగిరీలకుTG TET కటాఫ్ మార్కులు 2026 ఎంతంటే?

TG TET Answer Key విడుదల స్టేటస్ : విడుదల

TG TET 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింక్

TG TET 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింకులను ఈ దిగువున పట్టికలో అందించాం. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌లు విడుదలైన తర్వాత సంబంధిత లింకులను ఈ దిగువున అందించడం జరుగుతుంది.

TG TET 2026 ఆన్సర్ కీ డౌన్‌లోడ్ లింక్

ఇక్కడ క్లిక్ చేయండి

TG TET 2026 రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింక్

ఇక్కడ క్లిక్ చేయండి

TG TET 2026 ఆన్సర్ కీని చెక్ చేసుకునే విధానం

TG TET 2026 ఆన్సర్ కీని చెక్ చేసుకునే విధానం ఈ దిగువున వివరంగా అందించాం.

  • ముందుగా అభ్యర్థులు రాష్ట్ర అధికారిక TET వెబ్‌సైట్‌కు aptet.apcfss.in వెళ్లాలి.

  • హోంపేజీలో ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం కీలు లేదా ప్రాథమిక ఆన్సర్ కీ అనే లింక్‌లు కోసం చూడండి.

  • తర్వాత మీ నిర్ధిష్ట పరీక్షా పత్రం (పేపర్ 1 లేదా పేపర్ 2) సంబంధిత సబ్జెక్టు, షిఫ్ట్ (మీడియం)ను ఎంచుకోవాలి.

  • అనంతరం ఆన్సర్ కీని PDF ఫార్మాట్‌లో తెరిచి సేవ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయాలి.

  • సేవ్ చేసుకున్న ఆన్సర్ కీ PDF నుంచి మీ రెస్పాన్స్ షీట్‌లో మీరు గుర్తించిన సమాధానాలతో PDF లోని సమాధానాలను జతపరచాలి.

  • మీ స్కోర్‌ను అంచనా వేయడానికి మీ సరైన సమాధానాలను లెక్కించాలి. (సాధారణంగా సరైన సమాధానానికి +1, నెగిటివ్ మార్కులు లేకుండా).

TG TET 2026 ఆన్సర్ కీని అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి?

  • ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అధికారిక TG TET వెబ్‌సైట్‌ను https://tgtet.aptonline.in/tgtet/ సందర్శించాలి.

  • అనంతరం "ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు, "అభ్యంతరం తెలియజేయండి", ఆన్సర్ కీప సవాల్ చేయండి అనే లింకులపై క్లిక్ చేయాలి.

  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో హాల్ టికెట్ నెంబర్, రోల్‌ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తు వివరాలను చెక్ చేయాలి.

  • ప్రాంప్ట్ చేయబడితే పేపర్ (పేపర్ 1 లేదా పేపర్ 2), సబ్జెక్ట్/మీడియంలను ఎంచుకోవాలి.

  • వ్యత్యాసాలను గుర్తించడానికి మీ రెస్పాన్స్ షీట్‌ని, ప్రొవిజనల్ ఆన్సర్ కీని వీక్షించాలి.

  • మీరు అభ్యంతరాలు తెలియజేయాలనుకున్న ప్రశ్నలు ఎంచుకోవాలి.

  • ప్రశ్న ID/నెంబర్ (మాస్టర్ ప్రశ్నపత్రం నుంచి) నమోదు చేయాలి.

  • మీరు సరైనదని నమ్మే సమాధానాన్ని ఎంచుకోవాలి.

  • సహాయక ప్రూఫ్/పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. (PDF ఫార్మాట్, చెల్లుబాటయ్యే మూలాల నుంచి స్పష్టమైన స్కాన్).

  • డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా అభ్యంతర ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. (ప్రశ్నకు ₹200).

  • అభ్యంతరాన్ని సబ్మిట్ చేయాలి. రిఫరెన్స్ కోసం నిర్ధారణ/జర్నల్ నెంబర్, ప్రింటవుట్/స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.

  • సరైన ప్రూఫ్, ఫీజు లేకుండా లేదా గడువు తర్వాత సబ్మిట్ చేసిన అభ్యంతరాలు తిరస్కరించడం జరుగుతుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tg-tet-2026-answer-key-download-link-live-updates-76773/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top