ఎల్లుండితో TGCET దరఖాస్తుల గడువు ముగింపు, ఫిబ్రవరి 22న గురుకుల ప్రవేశ పరీక్ష

manohar

Updated On: January 19, 2026 05:38 PM

TGCET 2026 దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 21న ముగుస్తుంది. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. ఐదో తరగతి ప్రవేశాలు, బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు.

TGCET 2026TGCET 2026

TGCET దరఖాస్తుల గడువు 21న ముగింపు (TGCET applications close on the 21st): తెలంగాణలో SC, ST, BC, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు TGCET ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21తో ముగుస్తోంది. ఐదో తరగతి ప్రవేశాలతోపాటు ఉన్నత తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ కోసం డిసెంబర్ 11 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశలో ఉంది. గడువు పొడిగింపు అవకాశం లేకపోవడంతో , ఇంకా దరఖాస్తు చేయనివారు వెంటనే ఫారమ్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, BC, సాధారణ గురుకుల సొసైటీల తరఫున నడుస్తున్న 637 పాఠశాలల్లో ఐదో తరగతికి ఈ ఏడాది 51,408 సీట్లు ఉన్నాయని తెలిపారు. అందుకే అప్లికేషన్లపై భారీ స్పందన కనిపిస్తోంది. అలాగే 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలను కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల్లో చదివే అవకాశం ఆశిస్తున్న వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

TGCET 2026 రిజిస్ట్రేషన్: డైరెక్ట్ లింక్ (TGCET 2026 Registration: Direct Link)

విద్యార్థులు TGCET 2026 పరీక్షకు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

TGCET 2026 రిజిస్ట్రేషన్ లింక్

ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష (Statewide entrance exam on February 22nd)

TGCET ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల పంపిణీ, పర్యవేక్షణ వంటి అధికార చర్యలను SC గురుకుల సొసైటీ ఇప్పటికే ప్రారంభించింది. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు మరియు సూచించిన డాక్యుమెంట్స్ కలిగి, సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.

TGCET పరీక్ష తర్వాత మార్చిలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా పూర్తి పారదర్శకత ఉండేలా పరీక్షా వ్యవస్థను అమలు చేయనున్నారు. ఫలితాల తరువాత విద్యార్థుల మార్కుల ఆధారంగా, ఆన్‌లైన్‌లో ఎంపిక చేసిన ఆప్షన్ల ఆధారంగా దృష్టిలో పెట్టుకుని సీట్ల కేటాయింపు జరుగుతుంది. రీజనల్ ప్రాధాన్యత, మెరిట్, క్యాటగిరీలను పరిగణనలోకి తీసుకుని ఆటోమేటెడ్ కౌన్సెలింగ్ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యేలా గురుకుల సొసైటీ నిర్ణయించింది, మే చివరగా మొత్తం అడ్మిషన్–అలోట్మెంట్ షెడ్యూలు ముగించాలని నిర్ణయించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలస్యం లేకుండా స్కూల్ కేటాయింపు తెలుసుకుని అందుకు తగిన అకడమిక్ ప్లానింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య ఇస్తున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఈ TGCET పరీక్ష కీలక దశగా మారింది

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tgcet-2026-application-last-date-february-22nd-76597/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top