TGSRTC 2026 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు‌పై కీలక అప్‌డేట్

manohar

Published On:

TGSRTC విడుదల చేసిన 198 పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించబడదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు జనవరి 20 నాటికి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

TGSRTC Recruitment 2025TGSRTC Recruitment 2025

TGSRTC ఉద్యోగాలపై కీలక సమాచారం (Key information on TGSRTC jobs): TGSRTC తాజాగా విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల్లో భారీ ఆసక్తి కనిపిస్తుంది. డిసెంబర్ 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమై, జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో “దరఖాస్తు గడువు పొడిగించారు” అన్న వార్తలు రాయబారీకి కారణమయ్యాయి. ఈ విషయం చూసి ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి, గడువు పొడిగించామన్నారు అనే ప్రచారం మొత్తం అసత్యమే అని వెల్లడించింది. గడువు పొడిగించే విషయమే లేదని అధికారులు స్పష్టం చేశారు, అందుకే అభ్యర్థులు ఖచ్చితంగా నిర్ణీత తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నియామక ప్రక్రియలో మొత్తం 198 పోస్టులు ఉన్నాయి. వాటిలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. వయస్సు పరిమితి, రిజర్వేషన్ నియమాలు, కేటగిరీల వారీగా సడలింపులు వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఎంపిక రాత పరీక్ష, సర్టిఫికేట్ వేరిఫికేషన్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా జరుపబడుతుంది. అభ్యర్థులు పూర్తి అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం వంటి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం మంచిది.

TGSRTC ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Online application procedure for TGSRTC jobs)

TGSRTC అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన దశలను పాటించి TGSRTCకి సులభంగా దరఖాస్తు చేయగలరు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • ఆ తరువాత “Recruitment / Apply Online” ఆప్షన్ ఎంచుకోండి
  • కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
  • అప్లికేషన్ ఫామ్‌లో అవసరం అయిన వివరాలు నమోదు చేయండి
  • విద్యార్హతలు, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి
  • వివరాలు తనిఖీ చేసి అప్లికేషన్ సమర్పించండి
  • అప్లికేషన్ కాపీ డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి

TGSRTC ఉద్యోగాల జీతం & దరఖాస్తు ఫీజు వివరాలు (TGSRTC Jobs Salary & Application Fee Details)

జీతం వివరాలు (Salary Details)

ఎంపికైన అభ్యర్థులకు పోస్టుకు తగ్గట్టు జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • నెలవారీ జీతం: రూ.27,080 – రూ.81,400
  • పోస్ట్, గ్రేడ్, అనుభవాన్ని బట్టి జీతం పెరుగుతుంది.

దరఖాస్తు ఫీజు (Application fee)

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించాలి.

  • జనరల్: రూ.800
  • SC / ST: రూ.400
  • ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు.
TGSRTC విడుదల చేసిన 198 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనవరి 20లోపు తప్పనిసరిగా అప్లై చేయాలి. గడువు పొడిగించబడదని అధికారులు స్పష్టం చేసినందున, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tgsrtc-jobs-2026-application-deadline-update-76165/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top