TS EAMCET 2023 Answer Key Release Date: టీఎస్ ఎంసెట్ అధికారిక ఆన్సర్ కీ 2023 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

Rudra Veni

Published On:

మెడికల్ స్ట్రీమ్‌లొ ప్రవేశాల కోసం ఈరోజు అంటే మే 11, 2023న TS EAMCET 2023 పరీక్ష జరిగింది.  అభ్యర్థుల కోసం దీనికి సంబంధించిన అధికారిక ఆన్సర్ కీని (TS EAMCET 2023 Answer Key Release Date) జెన్ఎన్‌టీయూ త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
TS EAMCET 2023 Answer Key Release Date: టీఎస్ ఎంసెట్ అధికారిక ఆన్సర్ కీ 2023 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?TS EAMCET 2023 Answer Key Release Date: టీఎస్ ఎంసెట్ అధికారిక ఆన్సర్ కీ 2023 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

టీఎస్ ఎంసెట్ 2023 ఆన్సర్ కీ (TS EAMCET Answer Key 2023): టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు మే 10వ తేదీ నుంచి మే 14 వరకు జరగనున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ కోసం ఎగ్జామ్ జరిగింది. ఈరోజు (మే 11) అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో ప్రవేశాల కోసం పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆన్సర్ కీ (TS EAMCET Answer Key 2023) సాయంతో అభ్యర్థులు వారి అంచనా మార్కులను లెక్కించవచ్చు. విద్యార్థులు మార్కింగ్ స్కీమ్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది. ఏదైనా తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీని త్వరలో అధికారులు అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో విడుదల చేయడం జరుగుతుంది.
TS EAMCET 2023 పరీక్ష మూడు గంటల పాటు సీబీటీ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 160 MCQ ఆధారిత ప్రశ్నలు అడిగారు. ప్రశ్నపత్రంలో 3 విభాగాల నుంచి 160 ప్రశ్నలు ఉంటాయి. JNTU హైదరాబాద్, త్వరలోనే (మే నెలలోనే) అధికారిక TS EAMCET ఆన్సర్ కీని విడుదల చేస్తుంది.

TS EAMCET 2023 ముఖ్యమైన వివరాలు (TS EAMCET 2023 Important Details)

TS EAMCET 2023కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.
ఎంట్రన్స్ ఎగ్జామ్ TS EAMCET 2023
కండక్టింగ్ అథారిటీ జేఎన్‌టీయూ, హైదరాబాద్
టీఎస్ ఎంసెట్ 2023 తేదీలు మే 10, 2023 నుంచి మే 14, 2023
TS EAMCET 2023 ఆన్సర్ కీ రిలీజ్ డేట్ 2023, మే
అధికారికి వెబ్‌సైట్ eamcet.tsche.ac.in


TS EAMCET 2023 అధికారిక ఆన్సర్ కీని పొందడానికి దశలు (Steps to access TS EAMCET 2023 Answer Key)

జేఎన్‌టీయూ, హైదరాబాద్ అధికారిక TS EAMCET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అనుసరించాల్సిన స్టెప్స్‌ని ఈ కింద ఇవ్వబడ్డాయి.
  • ముందుగా అభ్యర్థులు eamcet.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • “Download Answer Key” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • TS EAMCET ఆన్సర్ కీకి అవసరమయ్యే ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
  • సరైన ప్రతిస్పందనలను చెక్ చేయడానికి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
TS EAMCET 2023 ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు పరీక్షలో తమ పని తీరును అంచనా వేసుకోవచ్చు. తమకు వచ్చే ర్యాంకులు, స్కోర్‌లు గురించి కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది.
అభ్యర్థులు మరిన్ని ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు, రిక్రూట్‌మెంట్‌ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ts-eamcet-2023-answer-key-release-date-40211/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top