TS EAMCET Hall Ticket 2023: TS EAMCET 2023 హాల్ టికెట్ రేపు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

TS EAMCET 2023 హాల్ టికెట్ రేపు (ఏప్రిల్ 30) ఆన్‌లైన్‌లో  (TS EAMCET Hall Ticket 2023)  విడుదలవుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
TS EAMCET 2023 Hall Ticket Releasing TomorrowTS EAMCET 2023 Hall Ticket Releasing Tomorrow

TS EAMCET 2023 హాల్ టికెట్ (TS EAMCET Hall Ticket 2023): జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ హైదరాబాద్ TS EAMCET 2023 హాల్ టికెట్‌ను రేపు అంటే (ఏప్రిల్ 30, 2023 (ఆదివారం) ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల (TS EAMCET Hall Ticket 2023) చేస్తుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు TS EAMCET అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.in నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను ఉపయోగించి లాగిన్ అయి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం TS EAMCET 2023 పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. అగ్రికల్చర్, మెడికల్ (AM) పరీక్ష మే 10, మే 11 తేదీల్లో నిర్వహించబడుతుంది. ఇంజనీరింగ్ (E) కోసం పరీక్ష మే 12, 13, 14, 2023 తేదీల్లో జరుగుతుంది.

TS EAMCET 2023 హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Access TS EAMCET 2023 Hall Ticket?)

విద్యార్థులు ఏప్రిల్ 30, 2023న TS EAMCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ హాల్ టికెట్‌లను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి దిగువ పేర్కొన్న సూచనలను ఫాలో అవ్వండి.

స్టెప్ 1: TS EAMCET అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.in కు వెళ్లాలి.

స్టెప్ 2: 'TS EAMCET 2023 హాల్ టికెట్' లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.

స్టెప్ 4: TS EAMCET 2023 హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. దానిని సేవ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 5: పరీక్ష రోజున తీసుకెళ్లడానికి TS EAMCET 2023 హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

TS EAMCET 2023 హాల్ టికెట్‌లో ఉండే వివరాలు (Details Mentioned in TS EAMCET 2023 Hall Ticket)

TS EAMCET 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్‌లో ఏ వివరాలు ఉంటాయో ఈ దిగువున పేర్కొవడం జరిగింది.

  • అభ్యర్థి పేరు
  • అభ్యర్థి ఫోటో, సంతకం
  • దరఖాస్తు నెంబర్
  • హాల్ టికెట్ నెంబర్
  • పరీక్ష తేదీ, సమయం
  • పరీక్షా కేంద్రం పేరు
  • పరీక్ష కేంద్రం వేదిక వివరాలు
  • పరీక్ష రోజు సూచనలు

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈమెయిల్ ఐడీ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

/news/ts-eamcet-2023-hall-ticket-releasing-tomorrow-at-eamcet-tsche-ac-in-39760/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top